బీజేపీ ఎంపీ ఆస్పత్రిలో పరుగెత్తించి కొట్టాడు | BJP MP assault hospital staff in Uttar Kannada | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ ఆస్పత్రిలో పరుగెత్తించి కొట్టాడు

Jan 4 2017 9:35 AM | Updated on Sep 5 2017 12:24 AM

బీజేపీ ఎంపీ ఆస్పత్రిలో పరుగెత్తించి కొట్టాడు

బీజేపీ ఎంపీ ఆస్పత్రిలో పరుగెత్తించి కొట్టాడు

కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ తన ప్రతాపాన్ని చూపించారు. ఆస్పత్రి సిబ్బందిపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులతో చుక్కలు చూపించారు.

బెంగళూరు: కర్ణాటకలో ఓ బీజేపీ ఎంపీ తన ప్రతాపాన్ని చూపించారు. ఆస్పత్రి సిబ్బందిపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులతో చుక్కలు చూపించారు. ఆ సమయంలో ఆయనను ఆపేందుకు ఆస్పత్రి ఇతర సిబ్బంది సైతం వెనుకడారు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో చిక్కి ఇప్పుడు వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్దే కొద్ది రోజుల కిందట కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లాలోగల సిర్సిలో తన తల్లిని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే, ఆమెకు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని భావించి ఒక్కసారిగా ఆగ్రహంతో ఆస్పత్రిలో సిబ్బందిలోని ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నారు. ఆస్పత్రి ఆవరణంలోనే అందరూ చూస్తుండగా పరుగెత్తించి కొట్టారు. అతడు అడ్డుకుంటున్నా ఆగకుండా దాడి చేశారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆస్పత్రి ఆవరణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. బాధితుడు ఆస్పత్రిలోని వీడియోతో సహా ఆధారాలు చూపించి ఫిర్యాదు చేసిన పోలీసులు మాత్రం ఇంత వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement