ఆయన సీఎం అయితే మరి యడియూరప్ప..?

BJP Leader Mistakenly Takes Oath As Chief Minister    - Sakshi

బెంగళూర్‌ : కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తూ ఓ సభ్యుడు నోరుజారిన తీరు హాట్‌టాపిక్‌గా మారింది. కేబినెట్‌ విస్తరణ సందర్భంగా మంగళవారం ఉదయం బీజేపీ నేత మధుస్వామి ప్రమాణ స్వీకారం చేస్తూ మంత్రిగా అనబోతూ ముఖ్యమంత్రి అని పొరపాటున పలకడంతో అందరూ విస్తుపోయారు. మధుస్వామి తడబడుతూ పొరపాటు పడినా ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడంతో సదరు మంత్రి ఊపిరిపీల్చుకున్నారు. జులై 26న ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టిన మూడు వారాల అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా యడియూరప్ప ఉల్లాసంగా కనిపించారు. ప్రమాణస్వీకారం చేస్తూ పొరబడిన మంత్రి మధుస్వామిని నవ్వుతూ పలుకరిస్తూ కౌగిలించుకున్నారు. మొత్తం 13 మంది ఎమ్మెల్యేలచే గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, మంత్రుల జాబితాకు బీజేపీ అధిష్టానం ఆమోదముద్ర కోసం సీఎం యడియూరప్ప మూడు వారాల పాటు వేచిచూశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top