రోడ్డుపై ఉమ్మి, చేతుల‌తో క్లీన్ చేసి | Biker Spat On Road And Clean With Hands In Chandigarh | Sakshi
Sakshi News home page

ఉమ్మేసిన వ్య‌క్తితోనే క్లీన్ చేయించారు

May 12 2020 4:58 PM | Updated on May 12 2020 5:13 PM

Biker Spat On Road And Clean With Hands In Chandigarh - Sakshi

చండీగఢ్‌: క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది. ఫేస్ మాస్కు ధ‌రించ‌క‌పోయినా, అన‌వ‌స‌రంగా రోడ్ల మీద‌కు వ‌చ్చినా, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఉమ్మివేసినా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి అదేమీ ప‌ట్టించుకోకుండా రోడ్డుపై ఉమ్మివేశాడు. అయితే కొన్ని క్ష‌ణాలకే తిరిగొచ్చి మ‌రీ దాన్ని క్లీన్ చేసిన ఘ‌ట‌న చండీగఢ్‌‌లో చోటు చేసుకుంది. పిల్లాడిని వెంటేసుకుని ఓ వ్య‌క్తి బైక్‌పై వెళుతున్నాడు. త‌న‌నెవ‌రూ గ‌మ‌నించట్లేద‌నుకున్నాడో ఏమో కానీ రోడ్డుపై ఉమ్మేశాడు. దీన్ని గ‌మ‌నించిన బ‌ల్దేవ్ సింగ్ అనే ట్రాఫిక్ వ‌లంటీర్ అత‌డిని ఆపేశాడు. (లాక్‌డౌన్‌: రోడ్లపై అడవి జంతువుల కలకలం)

స‌ద‌రు వ్య‌క్తి ఉమ్మిన ప్ర‌దేశాన్ని అత‌నితోనే శుభ్రం చేయించాడు. విశేష‌మేంటంటే ఇందులో అత‌ను రోడ్డుపై కూర్చొని త‌న స్వ‌హ‌స్తాలతో క్లీన్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. కాగా ప్ర‌ధాని మోదీ సైతం రోడ్ల‌పై ఉమ్మివేయ‌రాద‌ని ప్ర‌జ‌ల‌ను కోరిన విష‌యం తెలిసిందే. దీనివ‌ల్ల ప్రాథ‌మిక ప‌రిశుభ్ర‌త మెరుగ‌వుతుంద‌ని, క‌రోనా వైర‌స్‌కు వ్య‌తిరేకంగా పోరాడేందుకు కృషి చేస్తుందని ఆయ‌న‌ పేర్కొన్నారు. ఇదిలా వుండ‌గా క‌రోనా ముఖ్యంగా నోరు, ముక్కుతో పాటు కంటి ద్వారా వ్యాపిస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. (వైరల్‌ ఫొటో: తండ్రి, కూతుళ్లపై ప్రశంసలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement