దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడి అరెస్ట్ | Bengaluru, Dilsukhnagar Bomb Blast Case, Syed Ismail Afak arrrested | Sakshi
Sakshi News home page

దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడి అరెస్ట్

Jan 12 2015 10:38 AM | Updated on Aug 20 2018 4:44 PM

దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడి అరెస్ట్ - Sakshi

దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడి అరెస్ట్

బెంగళూరు బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు, ఉగ్ర కార్యకలాపాల్లో కీలకుడిగా వ్యవహరిస్తున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫక్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు : బెంగళూరు బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు,  ఉగ్ర కార్యకలాపాల్లో కీలకుడిగా వ్యవహరిస్తున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫక్  పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అఫక్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు పేలుళ్లతో అతనికి సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అలాగే దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల బాంబులను కూడా తానే తయారు చేసినట్లు అఫక్ ఒప్పుకున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతోనూ అఫక్కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.  కాగా అఫక్ను హైదరాబాద్ పోలీసులు త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు అఫక్ను పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకు రానున్నారు. కాగా  డిసెంబర్ 27న బెంగళూరులో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement