విద్యార్థినిని దేశం నుంచి వెళ్లిపొమ్మన్న అధికారులు

Bangladeshi Student Ordered To Leave Country - Sakshi

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేకతను వెళ్లగక్కినందుకుగానూ ఓ విద్యార్థినిని దేశం విడిచి వెళ్లిపోవాలని అధికారులు నోటీసులు పంపించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్‌కు చెందిన అఫ్సర అనిక మీమ్‌ అనే విద్యార్థి పశ్చిమ బెంగాల్‌లోని బిలురలో విశ్వభారతి విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది. దేశవ్యాప్తంగా చేపట్టిన సీఏఏ నిరసనలను ఆమె నిరంతరం పరిశీలిస్తూనే ఉంది. ఈ క్రమంలో డిసెంబర్‌లో సీఏఏను వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియాలో పలు పోస్టులు చేసింది. దీంతో ఆగ్రహించిన భారత విదేశాంగ శాఖ ఆమెను దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.(వేధింపులతోనే దేశం విడిచి వచ్చా)

ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాక వీసా నిబంధనలను సైతం బేఖాతరు చేసినట్లు ఆమెకు పంపిన నోటీసులో పేర్కొంది. దేశాన్ని వదిలి వెళ్లేందుకు 15 రోజుల గడువు విధించింది. కాగా ఫిబ్రవరి 14న ఈ నోటీసులు అందించగా, ప్రస్తుతం ఆమె స్వదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. గతంలోనూ సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నందుకుగానూ చెన్నైలో జర్మనీ విద్యార్థిని జాకబ్‌ లిన్‌ డిన్థెల్‌ను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన విషయం తెలిసిందే. (పాకిస్తాన్‌ జిందాబాద్‌; ‘కాల్చి పారెయ్యండి’)

దేశం విడిచి వెళ్లాలంటూ జర్మన్‌ విద్యార్థికి ఆదేశం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top