సర్కారుకు ఆటోవాలాల విజ్ఞప్తి! | Autowala Request To Delhi Government Allow Two passengers Per One Ride | Sakshi
Sakshi News home page

సర్కారుకు ఆటోవాలాల విజ్ఞప్తి!

May 20 2020 2:21 PM | Updated on May 20 2020 2:21 PM

Autowala Request To Delhi Government Allow Two passengers Per One Ride - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా లాక్‌డౌన్విధించడంతో ఆటోడ్రైవర్లు, టాక్సీవాలాలు తీవ్రంగా నష్టపోయారు. అయితే లాక్‌డౌన్‌ 4.0 లో కొన్ని సడలింపులతో ఆటోలు, క్యాబ్‌లు నడుపుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కానీ ఆటోలో కేవలం ఒక్క ప్రయాణీకుడికి మాత్రమే అనుమతి ఉందని తెలిపింది. దీంతో కనీసం ఇద్దరు ప్రయాణీకులనయిన ఆటోలో అనుమతించాలని డ్రైవర్లలందరూ బుధవారం ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. (ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి)

ఈ విషయం పై ఒక ఆటో డ్రైవర్‌ మాట్లాడుతూ ... ఒక్క ప్రయాణీకుడికే అనుమతిస్తే చాలా కష్టం అవుతుంది. ఫ్యామిలితో వెళ్లే వాళ్లు కనీసం ఇద్దరైనా వెళతారు. అటువంటి వారు పిల్లల్ని ఒంటరిగా ఒక ఆటోలో పెద్దలు ఒక ఆటోలో వెళ్లలేరు కదా. అందుకోసమే కేవలం ఇద్దరికైనా ఆటోలో ఎక్కేందుకు అనుమతినివ్వాలి అని కోరారు. ఇక ఆటోరిక్షా, ఈ- రిక్షా, సైకిల్‌ రిక్షాలో కేవలం ఒక్కరికి, ట్యాక్సీలో, క్యాబ్‌లో ఇద్దరికి, గ్రామీన్‌, ఫట్‌ఫట్‌, ఎకో ఫ్రెండ్లీ సేవలలో ఇద్దరికి, మ్యాక్సీ క్యాబ్‌లో ఐదుగురికి, ఆర్‌టీవీలలో 11 మంది ప్రయాణించడానికి ఢిల్లీ ప్రభుత‍్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు ప్రయాణీకుడు దిగగానే ఆ మొత్తం ప్రదేశాన్ని శానిటైజర్‌తో శుభ్రం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. (డబ్ల్యూహెచ్ఓలో కేంద్ర మంత్రికి కీలక పదవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement