
ఓ దొంగ తన చేతివాటంతో పర్సు కొట్టేస్తే.. అంతే చాకచక్యంగా
ముంబై : ఓ దొంగ తన చేతివాటంతో పర్సు కొట్టేస్తే.. అంతే చాకచక్యంగా ఓ పోలీసు అతన్ని క్షణాల్లో పట్టుకున్నారు. ఈ సంఘటన మన్మాడ్‌లోని రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. మహారాష్ట్రాలోని మన్మాడ్ రైల్వే స్టేషన్‌లో టికెట్ తీసుకోవడానికి వచ్చిన ఓ ప్రయాణికుడి పర్సును దొంగ కొట్టేసి, తన జేబులో పెట్టుకోబోయాడు. అక్కడే ఉన్న ఏఎస్‌ఐ దీన్ని గమనించి వెంటనే దొంగను పట్టుకున్నాడు.
రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెంటనే స్పందించి దొంగను పట్టుకున్న ఏఎస్‌ఐను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.