మసీదులపై మీకేం హక్కుంది?: ఒవైసీ | Asaduddin Reaction on UP Shia Central Waqf Board Proposal | Sakshi
Sakshi News home page

మసీదులపై మీకేం హక్కుంది?: ఒవైసీ

Aug 14 2017 10:53 AM | Updated on Sep 2 2018 5:24 PM

మసీదులపై మీకేం హక్కుంది?: ఒవైసీ - Sakshi

మసీదులపై మీకేం హక్కుంది?: ఒవైసీ

ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అయోధ్య అంశంపై ట్విట్టర్‌లో స్పందించారు.

హైదరాబాద్‌: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అయోధ్య అంశంపై ట్విట్టర్‌లో స్పందించారు. కేవలం ఏదో ఒక మతపెద్ద చెప్పాడన్న కారణంతో మసీదు నిర్మాణం చేపట్టడం జరగదని ఆయన పేర్కొన్నారు.

మసీదులన్నింటికి పెద్ద అల్లానే(భగవంతుడు). షియా, సున్ని, బరెల్వి, సూఫీ, దియోబంది, సలఫై, బొహ్రి ఇలా ఎన్ని బోర్డులు ఉన్నా వాటి బాధ్యత నిర్వాహణే తప్ప ఆధిపత్యం చెల్లాయించటం కాదంటూ ట్వీట్ లో ఒవైసీ పేర్కొన్నారు. "అల్లాను,  ఆయనిచ్చే తీర్పును నమ్మేవాళ్లు మాత్రమే మసీదును నిర్మిస్తారు. వాళ్ల రక్షణ కోసం అందులో నమాజ్‌లు నిర్వహిస్తారు. కానీ, వాటిపై పూర్తి హక్కు మాత్రం అల్లాదే" అని  స్పష్టం చేశారు.

అయోధ్యకు దూరంగా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు సుప్రీంకోర్టు ముందు ఓ ప్రతిపాదనను ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఒవైసీ ఇలా స్పందించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement