
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ(65)కి ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు సోమవారం డయాలసిస్ నిర్వహించారు. జైట్లీకి తొలుత కిడ్నీ ఆపరేషన్ చేస్తారని భావించినప్పటికీ ఆయన్ను పరీక్షించిన వైద్యులు మందులు, డయాలసిస్ ద్వారా సమస్యను తగ్గించవచ్చని సూచించడంతో మంత్రి అంగీకరించారు. ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో రెండ్రోజులు గడిపిన జైట్లీ.. సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఇన్ఫెక్షన్ పెరగవచ్చన్న కారణంతో ప్రస్తుతం ఆయన్ను కలిసేందుకు ఎవ్వరినీ అనుమతించడంలేదు.