అర్జున అవార్డు గ్రహీత, అసిస్టెంట్ కమాండెంట్ నరీందర్ సింగ్(45) ఉరివేసుకుని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
జలంధర్: అర్జున అవార్డు గ్రహీత, అసిస్టెంట్ కమాండెంట్ నరీందర్ సింగ్(45) ఉరివేసుకుని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ హత్య కేసుకు సంబంధించి క్రిమినల్ కేసు నమోదు కావడంతో ఈయనను రెండేళ్ల క్రితం సస్పెండ్ చేసినట్లు జలంధర్ పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి మానసిక వేదనతో ఉన్న కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెప్పారు.
ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కాగా ఓ మహిళా పోలీస్ అధికారిపై ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినట్లు నరీందర్‌పై ఆరోపణలు కూడా ఉన్నట్లు మరో అధికారి పేర్కొన్నారు. నరీందర్ జూడో క్రీడాకారుడు. కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్‌లో పాల్గొని సత్తా చాటాడు. 1998లో కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేసింది.