రూ. 40 లక్షల 10, 20 నోట్లను విసిరారు! | Approximately Rs 40 Lakhs in Rs 10 & Rs 20 notes showered on folk singers in a musical event in Navsari, Gujarat | Sakshi
Sakshi News home page

రూ. 40 లక్షల 10, 20 నోట్లను విసిరారు!

Dec 26 2016 12:15 PM | Updated on Sep 4 2017 11:39 PM

రూ. 40 లక్షల రూపాయలను, అదికూడా 10, 20 నోట్లను సంగీతకారులపై విసిరారు

అహ్మదాబాద్‌: నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. గంటల కొద్ది క్యూలలో నిలుచున్న తరువాత ఒక పెద్ద నోటు చేతికి దొరికినా దానికి చిల్లర దొరకడం కష్టంగా మారింది. అయితే ఈ పరిస్థితి అందరి విషయంలో ఒకేలా లేదని ఈ వీడియో చూస్తే మీకు అర్ధమౌతుంది.

గుజరాత్‌లోని నవ్సారిలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో సుమారు 40 లక్షల రూపాయల విలువచేసే.. 10, 20 రూపాయల నోట్లను సంగీతకారులపై విసిరారు. సంగీత కార్యక్రమంలో గాయకుల వద్దకు చేరుకున్న మహిళలు, పురుషులు పోటీపడి డబ్బులు విసురుతున్న దృశ్యాలు చూస్తే.. ఇంత మొత్తంలో చిల్లర డబ్బు వీరి చేతికి ఎలా చేరింది అనే సందేహం కలుగక మానదు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement