మణిపూర్ వర్సిటీ వద్ద బాంబు పేలుడు | Sakshi
Sakshi News home page

మణిపూర్ వర్సిటీ వద్ద బాంబు పేలుడు

Published Wed, Aug 10 2016 4:03 PM

మణిపూర్ వర్సిటీ వద్ద బాంబు పేలుడు

ఇంపాల్: మణిపూర్లో మరో బాంబు పేలుడు సంభవించింది. అంతకుముందు బాంబుపేలుడు చోటుచేసుకొని గంటలు కూడా గడవకముందే మరో బాంబు పేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈసారి ఇంపాల్ లోని మణిపూర్ యూనివర్సిటీ వద్ద బాంబు పేలుడు సంభవించింది. రిమోట్ ద్వారానే ఈ రెండు బాంబు పేలుడ్లు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో మాపౌ అనే గ్రామం వద్ద బీఎస్ఎఫ్ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనూహ్యంగా బాంబు పేలింది. అయితే, ఈ దాడి నుంచి బీఎస్ఎఫ్ జవాన్లు తప్పించుకోగా.. నాలుగేళ్ల పాపకు మాత్రం గాయాలయ్యాయి. రెండోసారి బాంబు దాడి మాత్రం యూనివర్సిటీ వద్ద సంభవించింది. ఈ ఘటన సమయంలో విద్యార్థులంతా క్లాస్ రూముల్లోనే ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని ప్రాథమిక సమాచారం.

Advertisement
Advertisement