నాకు సెక్యురిటీ వద్దు: హజారే

Anna Hazare Demands His Security Be Withdrawn - Sakshi

పుణే: ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతకు ఉపసంహరించుకోవాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. తనకు భద్రత కల్పించడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. తనకు గతంలో బెదిరింపులు వచ్చినా లెక్కచేయలేదన్నారు. ఇటీవల చాలామందికి భద్రతను తగ్గించడం లేదా తొలగించిన ప్రభుత్వం తను కోరినా స్పందించలేదన్నారు. అందుకే మరోసారి లేఖ రాశానని హజారే పేర్కొన్నారు.

కాగా, దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు ఉన్న ఎక్స్‌ కేటగిరీ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుదించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు మాత్రం సెక్యురిటీ పెంచడం గమనార్హం. వై ప్లస్‌ సెక్యూరిటీ నుంచి జెడ్‌ ప్లస్‌కు పెంచారు. 29 మంది నాయకుల భద్రతా కేటగిరీలో మార్పులు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top