పెను తుపానుగా మారిన ‘అంఫన్‌’

amphan cyclone Affected To Tamil Nadu And Odisha Alert - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడుపై అంఫన్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను కారణంగా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సేలం, ఈరోడ్, ధర్మపురి, కోయంబత్తూర్‌, క్రిష్ణగిరి జిల్లాలో భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలకు పడుతున్నాయి. కొన్ని చోట్ల హోర్డింగ్‌లు, చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డ. బంగాళాఖాతంలో పెను తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలోని హార్బర్‌లలో మూడో ప్రమాద హెచ్చరిక సూచి ఎగుర వేశారు. రామేశ్వరం నుంచి చెన్నై ఎన్నూర్‌ హార్బర్‌ వరకు ఈ హెచ్చరిక జారీ అయింది. సముద్ర తీరంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో జాలర్లు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఆదివారం రాత్రి సాయంత్రం తీవ్ర తుపాన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. (అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్‌’).

సోమవారం నాటికి పెను తుపానుగా మారిన అంఫన్.. సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారనుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. దిఘా, బంగ్లాదేశ్ హటియా దీవుల మద్య తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.  తీరం దాటే సమయంలో 155-185 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది తదుపరి ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్- బంగాదేశ్ తీరాల వద్ద  డిగా, హతియా దీవులు(బాంగ్లాదేశ్) మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అంఫాన్‌ వల్ల ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తాజా హెచ్చరికలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అ‍య్యింది. సముద్ర తీరంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. 

దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాల మధ్య తుపాను కొనసాగుతోంది. ఉత్తర దిశగా ప్రయాణించి మరింత తీవ్రమై ఈరోజు (మే 18వ తేదీన) ఉదయం 05.30 గంటలకు అత్యంత తీవ్ర తుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో పారదీప్ (ఒరిస్సా)కు దక్షిణ దిశగా 790 కిమీ, డిగా (పశ్చిమ బెంగాల్)కు దక్షిణ నైఋతి  దిశగా 940 కిమీ, ఖేపుపర (బంగ్లాదేశ్)కు దక్షిణ నైఋతి దిశగా 1060కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top