డబ్ల్యూహెచ్‌వో అంబాసిడర్‌గా అమితాబ్‌ | Amitabh as the WHO Ambassador | Sakshi
Sakshi News home page

డబ్ల్యూహెచ్‌వో అంబాసిడర్‌గా అమితాబ్‌

May 13 2017 2:18 AM | Updated on Sep 5 2017 11:00 AM

డబ్ల్యూహెచ్‌వో అంబాసిడర్‌గా అమితాబ్‌

డబ్ల్యూహెచ్‌వో అంబాసిడర్‌గా అమితాబ్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తరఫున గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తరఫున గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ నియమితులయ్యారు. ఆగ్నేయాసియా హెపటైటిస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటామని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా రీజనల్‌ డైరెక్టర్‌ పూనం ఖేత్రాపాల్‌ సింగ్‌ తెలిపారు.

హెపటైటిస్‌ వల్ల గర్భస్థ శిశుమరణాలు సంభవిస్తున్నాయని, వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు అమితాబ్‌ సహకారం తీసుకుంటామన్నారు. అమితాబ్‌ సహకారంతో 2030 కల్లా హెపటైటిస్‌ ప్రభావాన్ని తగ్గించడానికి డబ్ల్యూహెచ్‌వో కృషి చేస్తుందన్నారు. హెపటైటిస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని అమితాబ్‌ బచ్చన్‌ తెలిపారు. తనలా ఎవరూ ఈ వ్యాధితో బాధపడకూడదని ఆకాంక్షించారు. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం 9 కోట్ల మంది దీర్ఘకాలిక లివర్‌ వ్యాధులతో బాధపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement