ముస్లింలకు మోడీ వ్యతిరేకం కాదు: శివసేన | Amid seat-sharing tussle, Shiva Sena backs Narendra Modi for praising Muslims | Sakshi
Sakshi News home page

ముస్లింలకు మోడీ వ్యతిరేకం కాదు: శివసేన

Sep 22 2014 2:21 PM | Updated on Mar 29 2019 9:24 PM

ముస్లింలకు మోడీ వ్యతిరేకం కాదు: శివసేన - Sakshi

ముస్లింలకు మోడీ వ్యతిరేకం కాదు: శివసేన

బీజేపీతో సీట్ల ఒప్పందంపై సందిగ్ధత చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి శివసేన బాసటగా నిలిచింది

హైదరాబాద్: బీజేపీతో సీట్ల ఒప్పందంపై సందిగ్ధత చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి శివసేన బాసటగా నిలిచింది. భారతీయ ముస్లీంలను కీర్తిస్తూ చేసిన మోడి వ్యాఖ్యలను శివసేన స్వాగతించింది. మోడీ వ్యాఖ్యలు భారతీయ ముస్లింలకు భరోసానిచ్చాయని శివసేన వ్యాఖ్యలు చేసింది. మోడీ వ్యాఖ్యల ద్వారా ముస్లింల్లో విశ్వాసం పెరిగిందని పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో వెల్లడించింది. 
 
ముస్లింలకు మద్దతివ్వడం ద్వారా హిందుత్వంపై మోడి ధోరణి మారదని, ముస్లింలకు మోడీ వ్యతిరేకమని కుహనా లౌకికవాదులు ప్రచారం చేశారని  సంపాదకీయంలో పేర్కొన్నారు. ఎవరో ఒకరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే ఆ సమాజాన్ని మొత్తం ఉగ్రవాదులుగా చూడకూడదని సామ్నాలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement