
అమర్‌నాథ్ యాత్రను రద్దు చేసిన అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర రద్దయింది. గత ఏడాది జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో అమర్‌నాథ్ యాత్ర నుంచి యాత్రికులు తమ పర్యటనను కుదించుకుని వెననుతిరిగారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు అమర్‌నాథ్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,471కి పెరిగింది. కరోనా బారినపడి బుధవారం 49 మంది మరణించడంతో మృతుల సంఖ్య 652కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.