వీధుల్లో భజనలు, నమాజ్‌ను నిషేధించిన అధికారులు

Aligarh Administration Bans Religious Activities On Roads - Sakshi

లక్నో : కొన్ని మత సంస్థలు వీధుల్లో హనుమాన్‌ చాలీసా చదవడం, మహా హారతి ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే వార్తలు రావడంతో వీధుల్లో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించరాదని అలీగఢ్‌ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. ముస్లింలు రోడ్లపై నమాజ్‌ చేస్తుండటంతో అందుకు ప్రతిగా కొన్ని హిందూ సంస్థలు రహదారులపై మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయనే సమాచారాన్ని అలీగఢ్‌ జిల్లా మేజిస్ర్టేట్‌ చంద్ర భూషణ్‌ సింగ్‌ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు.

దీంతో ఇరు మతాల పెద్దలతో సమావేశమైన జిల్లా మేజిస్ర్టేట్‌ రోడ్లపై ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. వీధుల్లో కాకుండా దేవాలయాలు, మసీదుల్లో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టాలని ఆయా సంస్థలు, సంఘాలకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలీగఢ్‌ సమస్యాత్మక ప్రాంతమైనందున ఎలాంటి మతపరమైన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టేముందు నిర్వాహకులు అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top