
మళ్లీ చవక ధరలకు విమానయానం
చవక ధరలకే విమానయానం ఇస్తామంటూ కొత్తగా సేవలు ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ మరోసారి ప్రమోషనల్ ఆఫర్లను ప్రకటించింది.
చవక ధరలకే విమానయానం ఇస్తామంటూ కొత్తగా సేవలు ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ మరోసారి ప్రమోషనల్ ఆఫర్లను ప్రకటించింది. గతంలో 339 రూపాయలకే బెంగళూరు - చెన్నై నగరాల మధ్య విమాన యానాన్ని అందించిన ఈ సంస్థ ఇప్పుడు బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-చెన్నై నగరాల మధ్య రూ. 1490 చొప్పున, బెంగళూరు-గోవా మధ్య రూ. 1690 చొప్పున ఛార్జీలు నిర్ణయించింది.
ఈ టికెట్లను ఈనెల 29వ తేదీలోపు బుక్ చేసుకోవాలి. అంటే, బుకింగ్కు వారం రోజుల సమయం ఇచ్చారు. జూలై 1 నుంచి అక్టోబర్ 25వ తేదీ మధ్య ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-గోవా మార్గాల్లో బుక్ చేసుకునే టికెట్ల మీద ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రయాణాలు చేయొచ్చు.