విమానంలోంచి కిందపడిన ఫ్లైట్‌ అటెండెంట్‌

Air India flight attendant falls off plane at Mumbai airport - Sakshi

ముంబై: ముంబై ఎయిర్‌పోర్టులో ఓ 53 ఏళ్ల మహిళా ఫ్లైట్‌ అటెండెంట్‌ ఎయిరిండియా విమానం డోర్‌ను మూసే క్రమంలో అదుపు తప్పి కిందపడిపోయారు. దాంతో ఆ మహిళకు తీవ్రగాయాలైనట్లు ఎయిర్‌లైన్స్, ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ముంబై నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉన్న బోయింగ్‌–777 విమానం డోరును మూస్తూ ఫ్లైట్‌ అటెండెంట్‌ హర్షా లోబో అదుపుతప్పారు. దీంతో డోర్‌కు మెట్ల నిచ్చెనకు మధ్య ఖాళీలోంచి 20 అడుగుల కింద ఉన్న రన్‌వేపై పడ్డారు. ఆమె కాళ్ల ఎముకలు విరిగాయని.. నానావతి ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top