నేవీ ఛీఫ్‌గా అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్‌ | Admiral Karambir Singh assumes charge as the 24th Chief of the Naval Staff | Sakshi
Sakshi News home page

నేవీ ఛీఫ్‌గా అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్‌

May 31 2019 11:30 AM | Updated on May 31 2019 12:02 PM

Admiral Karambir Singh assumes charge as the 24th Chief of the Naval Staff - Sakshi

న్యూ ఢిల్లీ : భార‌త నేవీ ఛీఫ్ అడ్మిరల్‌గా క‌రంబీర్ సింగ్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అడ్మిరల్ సునీల్ లాంబా నుంచి 24వ నేవీ ఛీఫ్‌గా క‌రంబీర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. నేవీ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం గొప్ప గౌర‌వంగా భావిస్తాన‌ని క‌రంబీర్ తెలిపారు. 

చేతక్‌, కమోవ్‌-25, కమోవ్‌-28 హెలీకాఫ్టర్‌లను నడిపిన అనుభవం ఉంది. ఇండియన్‌ నేవీలో హెలీకాఫ్టర్‌ పైలెట్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఇండియన్‌ నేవీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి క‌రంబీర్ సింగ్ కావడం విశేషం. భార‌త నౌకాద‌ళాన్ని అడ్మిర‌ల్ సునిల్ లాంబా ఎంతో ప‌టిష్టం చేశార‌ని నేవీకి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను క‌రంబీర్ సింగ్ కొనియాడారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement