చైనాలో ప్రక్షాళన.. నేవీ చీఫ్‌, అణు శాస్త్రవేత్తకు ఉద్వాసన | China Expelled Naval Chief And Top Nuclear Scientist, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

చైనాలో ప్రక్షాళన.. నేవీ చీఫ్‌, అణు శాస్త్రవేత్తకు ఉద్వాసన

Jun 28 2025 7:02 AM | Updated on Jun 28 2025 12:48 PM

China expelled naval chief And top nuclear scientist

బీజింగ్‌: చైనాలో శక్తివంతమైన రక్షణ, భద్రతా విభాగాల్లో ప్రక్షాళన కొనసాగుతోంది. తాజాగా ఉద్వాసనకు గురైన వారిలో, నేవీ చీఫ్, అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త ఉన్నారు. చైనా సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నేవీ(పీఎల్‌ఏఎన్‌) చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ లి హన్‌జున్, చైనా నేషనల్‌ న్యూక్లియర్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ చీఫ్‌ లియు షిపెంగ్‌లకు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌(ఎన్‌పీసీ) సభ్యత్వాలను రద్దు చేశారు. శుక్రవారం ముగిసిన ఎన్‌పీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

అదేవిధంగా, సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌(సీఎంసీ)సభ్యుడిగా ఉన్న టాప్‌ జనరల్‌ మియావో హువా అధికారాలకు సైతం కత్తెరవేశారు. చైనా మిలటరీ అత్యున్నత నిర్ణాయక విభాగం సీఎంసీ. దీనికి బాస్‌ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ కావడం గమనార్హం. చైనా మిలటరీలో చిన్న వయస్సులోనే ఉన్నత స్థాయికి చేరుకున్న మియా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికార కమ్యూనిస్ట్‌ పార్టీపై పూర్తిస్థాయి పట్టు కలిగిన అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఇటీవలి కాలంలో ఇద్దరు రక్షణ మంత్రులను సైతం తొలగించి, తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement