 
													కోల్‌కతా: ఇప్పటి వరకు ఆచరణలో ఉన్న ‘మైలార్డ్’, ‘లార్డ్‌షిప్’ లాంటి సంబోధన తగదని, తనను ‘సర్’ అని మాత్రమే పిలిస్తే సరిపోతుందని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాక్రిష్ణన్ వ్యాఖ్యానించారు. బెంగాల్, అండమాన్‌లలోని న్యాయాధికారులందరూ తనను ‘సర్’ అనే సంబోధించాలని ఆయన సూచించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాయ్ చటోపాధ్యాయ.. బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని జిల్లా జడ్జీలకు, కింది కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు చీఫ్ జస్టిస్ చేసిన సూచనలను పంపారు. ఇకపై జిల్లా న్యాయాధికారులు, హైకోర్టులోని రిజిస్ట్రీ సిబ్బంది తనను ‘సర్’అని సంభోదించాలని చీఫ్ జస్టిస్ ఆకాంక్షించారు. 
(హైకోర్టు జడ్జికి కరోనా రావాలి: లాయర్)

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
