
మహిళ పొట్టలో 152 ఇనుప వస్తువులు!
పెరిగిన ఉదరభాగం, కాళ్లు, చేతుల్లో విపరీతమైన వాపు, తీవ్ర రక్తస్రావం తదితర సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన లక్ష్మి (35) అనే మతిస్థిమితంలేని రోగిని పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యపోయారు
చెన్నై: పెరిగిన ఉదరభాగం, కాళ్లు, చేతుల్లో విపరీతమైన వాపు, తీవ్ర రక్తస్రావం తదితర సమస్యలతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరిన లక్ష్మి (35) అనే మతిస్థిమితంలేని రోగిని పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమె గర్భాశయానికి తీసిన ఎక్స్‌రేలో 152 ఇను ప వస్తువులు కనిపించడంతో అవాక్కయ్యారు. వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి వాటిని తొలగించారు.
మూడు నెలల కిందట ఆపరేషన్ నిర్వహించినా పూర్తిస్థాయిలో కోలుకునేందుకు అప్పటి నుంచీ ఆస్పత్రిలోనే ఆమెను పర్యవేక్షిస్తూ వచ్చిన వైద్యులు అరుదైన ఈ కేసు వివరాలను బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. లక్ష్మి కొన్నే ళ్లుగా ఇనుప వస్తువులను తిన్నడం తో ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నదన్నా రు. శస్త్రచికిత్స వల్ల ఆమెకు ప్రాణాపాయం తప్పిందన్నారు. అయితే లక్ష్మీ అనారోగ్యాన్ని కుటుంబ సభ్యులు మొదట చేతబడిగా భావించి మంత్రగాళ్లను ఆశ్రయించారన్నారు