గౌరీ హత్యపై కేంద్రానికి కర్ణాటక నివేదిక | A report to the Home Ministry of Karnataka on Gowri Lakesh murder | Sakshi
Sakshi News home page

గౌరీ హత్యపై కేంద్రానికి కర్ణాటక నివేదిక

Sep 10 2017 3:38 AM | Updated on Sep 12 2017 2:22 AM

‘లంకేశ్‌ పత్రిక’ సంపాదకురాలు గౌరీ లంకేశ్‌ హత్యపై కర్ణాటక ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ నివేదిక సమర్పించింది.

న్యూఢిల్లీ:  ‘లంకేశ్‌ పత్రిక’ సంపాదకురాలు గౌరీ లంకేశ్‌ హత్యపై కర్ణాటక ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ నివేదిక సమర్పించింది. బెంగళూరు రాజరాజేశ్వరీ నగర్‌లోని ఇంట్లో ఇటీవల గుర్తుతెలియని దుండగులు గౌరిపై కాల్పులు జరిపి హతమార్చడం తెలిసిందే. దీనిపై హోం శాఖ కర్ణాటకను నివేదిక కోరింది. హత్య, ఆ తర్వాత పోలీసులు చేపట్టిన చర్యలను వివరిస్తూ కర్ణాటక ప్రధాన కార్యదర్శి నివేదికను హోం శాఖకు అందజేశారు. హత్యపై విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement