900 ఏళ్ల క్రితమే అవి ఉన్నాయి..!

900 Years Ago Ancient Indian Men Used Footwear Like Company Sells Today - Sakshi

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా విస్తృతి పెరడంతో సమాచార మార్పిడి వేగంగా జరుగుతోంది. ఏదైనా వింత, విశేషం, స్ఫూర్తిమంతమైన కథలకు ట్విటర్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తుంది. తాజాగా తమిళనాడుకు చెందిన వి.గోపాలన్‌​ అనే వ్యక్తి చేసిన ఓ పోస్టు ఆసక్తిగొలిపేదిగా ఉంది. దాదాపు 900 ఏళ్ల క్రితమే ప్రాచీన పురుషులు నేటి బాటా చెప్పులని పోలిన పాదరక్షలు వాడారని ఆయన​ ట్విటర్‌ ఓ శిల్పం ఫొటో షేర్‌ చేశాడు. అది తమిళనాడులోని అవుదయార్‌కోయిల్‌ ఆలయంలోనిదని ఆయన పేర్కొన్నాడు. ‘మన ప్రాచీనులు చాలా ఫ్యాషనబుల్‌. ఎన్నో వందల ఏళ్ల క్రితమే వారు శాండల్స్‌ ధరించారు. అవి ఎలా ఉన్నాయంటే.. బాటా పాదరక్షలను పోలి ఉన్నాయి. కావాలంటే ఫొటోను జూమ్‌ చేసి చూడండి’ అని క్యాప్షన్‌ పెట్టాడు. 

కాగా, గోపాలన్‌ ట్వీట్‌పై స్పందించిన ఓ యూజర్‌.. ‘ప్రాచీన కాలంలో.. దాదాపు 1400 ఏళ్ల క్రితం స్త్రీలు కూడా హీల్స్‌ వేసుకునేవారు. కంచిలోని కైలాసనాథర్‌ ఆలయంలోని ఈ శిల్పం ఫొటో చూడండి’ అని పేర్కొన్నాడు. వందల ఏళ్ల క్రితమే మహిళలు హై హీల్స్‌ వేసుకునేవారని మరో యూజర్‌ శాండల్స్‌ ధరించి ఉన్న శిల్పం ఫొటో షేర్‌ చేశాడు. ఇక  అవుదయార్‌కోయిల్‌ ఆలయం 900 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు గోపాలన్‌ సమాధనమిచ్చాడు. రోమ్‌నగరం, ఏథెన్స్‌ నగరాలు ఉనికిలోకి రాకమునుపే మన కాశీ నగరం బాగా అభివృద్ధి చెందిందని మరొక యూజర్‌ రాసుకొచ్చారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top