బిహార్ లోని పట్నా జిల్లాలో అక్రమంగా తరలిస్తోన్న 700 కిలోగ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
పట్నా: బిహార్ లోని పట్నా జిల్లాలో అక్రమంగా తరలిస్తోన్న 700 కిలోగ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి అక్రమంగా రవాణాచేస్తున్న ఇద్దరిని అరెస్టుచేసి, వారి వద్ద నుంచి ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అస్సాం ప్రాంతానికి చెందిన రూబెల్ హుస్సేన్, నాగలాండ్కు చెందిన అలీ హుస్సేన్ అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వీరిని అరెస్టు చేసి రూ.28 లక్షల విలువ గల గంజాయిని సీజ్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. వారణాసికి చెందిన ఓ ట్రక్ మణిపూర్ నుంచి బిహార్లోకి ప్రవేశించింది. అలీ హుస్సేన్, రూబెల్ హుస్సేన్లు ఈ వాహనం ద్వారా 7 క్వింటాళ్ల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న రెవెన్యూ విభాగం అధికారులు మాటువేసి పట్టుకున్నారు. వాహనానికి అవసరార్థం ఉంచే అదరననపు టైరులో గంజాయిని ఉంచి స్మగ్లింగ్ కు పాల్పడ్డారని తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం కింద వీరిపై కేసు నమోదు చేయడంతో పాటు గంజాయి సీజ్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.