జమ్ము కాశ్మీర్లో 70% దాటిన పోలింగ్! | 70 percent polling recorded in J and K | Sakshi
Sakshi News home page

జమ్ము కాశ్మీర్లో 70% దాటిన పోలింగ్!

Nov 25 2014 5:33 PM | Updated on Sep 2 2017 5:06 PM

జమ్ము కాశ్మీర్లో 70% దాటిన పోలింగ్!

జమ్ము కాశ్మీర్లో 70% దాటిన పోలింగ్!

ఉత్తర కాశ్మీర్లో రెండుచోట్ల బాంబులు పేలాయి. అయినా, తొలిసారిగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ దాటింది.

ఉత్తర కాశ్మీర్లో రెండుచోట్ల బాంబులు పేలాయి. అయినా, తొలిసారిగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ దాటింది. తొలి విడతలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఈ రికార్డు స్థాయి పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. మంగళవారం పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 70% పోలింగ్ రికార్డయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నియోజకవర్గంలో అయితే కనిష్ఠంగా కేవలం వెయ్యి ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆ స్థితి నుంచి క్రమంగా బయటపడి.. ఇప్పుడు 70% పోలింగ్ నమోదుచేసే స్థితికి జమ్ము కాశ్మీర్ చేరుకుంది.

ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలోని ఎనిమిది మంది మంత్రులు సహా మొత్తం 132 మంది అభ్యర్థులు తొలిదశలో పోటీపడ్డారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం చలి కారణంగా పోలింగ్ కొంత మందగించినా, మధ్యాహ్నానికి బాగా పుంజుకుంది. బండిపురా ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రం బయట బాంబు పేలింది. అలాగే ఇదే ప్రాంతంలో మరోచోట కూడా మధ్యాహ్నం ఇంకో బాంబు పేలింది. అయినా.. ఓటర్లు మాత్రం చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో ఓట్లు వేసేందుకు ముందుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement