బాంబులు పేలి ఆరుగురి మృతి | 4 dead, several injured after crude bomb explodes in West Bengal's Malda | Sakshi
Sakshi News home page

బాంబులు పేలి ఆరుగురి మృతి

May 3 2016 2:24 AM | Updated on Sep 3 2017 11:16 PM

పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో బాంబుల్ని నిర్వీర్యం చేస్తుండగా అవి పేలి సోమవారం ఇద్దరు సీఐడీ అధికారులు మరణించారు.

బెంగాల్లో ఘటన

 మాల్దా: పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో బాంబుల్ని నిర్వీర్యం చేస్తుండగా అవి పేలి సోమవారం ఇద్దరు సీఐడీ అధికారులు మరణించారు. అంతకుముందు అక్కడే బాంబు పేలి నలుగురు మృతిచెందారు. మే 5న చివరి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బాంబు పేలుళ్లు కలకలం రేపాయి.

మాల్దా జిల్లా జౌన్‌పూర్ గ్రామంలో గైసు షేక్ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాంబులు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఒకరు సంఘటన స్థలంలో, ముగ్గురు ఆస్పత్రిలో మరణించారు. ఆ గ్రామంలో మరో రెండు బాంబుల్ని కనుగొనడంతో సీఐడీకి చెందిన బాంబు నిర్వీర్వ బృందానికి సమాచారమిచ్చారు. వాటిని నిర్వీరం చేస్తుండగా పేలడంతో విశుద్దానంద మిశ్రా, సుబ్రతా చౌదరి అనే ఇద్దరు సీఐడీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement
 
Advertisement
Advertisement