ఫిలిప్పీన్స్‌లో పడవ మునిగి 38 మంది మృతి | 36 dead, 127 rescued in Ormoc sea mishap | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌లో పడవ మునిగి 38 మంది మృతి

Jul 3 2015 1:56 AM | Updated on Apr 3 2019 5:24 PM

ఫిలిప్పీన్స్‌లో పడవ మునిగి 38 మంది మృతి - Sakshi

ఫిలిప్పీన్స్‌లో పడవ మునిగి 38 మంది మృతి

ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోయిన ఘటనలో 38 మంది మరణించారు.

మనీలా(ఫిలిప్పీన్స్): ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోయిన ఘటనలో 38 మంది మరణించారు. 26 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎం/బీ కిమ్ నిర్వాణ అనే ఈ పడవ ఆర్మాక్ నుంచి కామోట్స్ దీవులకు వెళుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. పోర్టు నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే పడవ ప్రమాదం పాలైంది. బలమైన గాలుల కారణంగా సముద్ర జలాలు అల్లకల్లోలంగా మారడంతో ఇది అదుపుతప్పి తిరగబడినట్టు భావిస్తున్నారు.

ప్రమాద సమయంలో అందులో మొత్తం 189 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రమాదం సంభవించిన సమయంలో చుట్టుపక్కల ఉన్న ఫిషింగ్ బోట్లలోనివారు, కోస్ట్‌గార్డు సిబ్బంది వెంటనే స్పందించారు. కనీసం 127 మందిని వీరు కాపాడినట్టు కోస్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement