భారీ వ‌ర్షాల‌కు భ‌వ‌నం కూలి ముగ్గురు మృతి | 3 killed In Dehradun Building Collapse Rescue Operation Underway | Sakshi
Sakshi News home page

భారీ వ‌ర్షాల‌కు భ‌వ‌నం కూలి ముగ్గురు మృతి

Jul 15 2020 2:10 PM | Updated on Jul 15 2020 4:27 PM

3 killed In Dehradun Building Collapse Rescue Operation Underway - Sakshi

డెహ్రాడూన్: భారీ వ‌ర్షాల‌కు ఓ భ‌వ‌నం కూలి ముగ్గురు మృత‌చెందిన ఘ‌ట‌న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ చుక్కువాలా ప్రాంతంలో బుధ‌వారం చోటుచేసుకుంది. మ‌రో ముగ్గురు  తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మృతుల్లో 37 ఏళ్ల గ‌ర్భిణీ మహిళ కూడా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. శిధిలాల కింద మ‌రికొంత మంది చిక్కుకుపోయిన‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌న స్థ‌లిలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేస్తోంది. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల‌కు రాష్ట్రంలోని  ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement