13 మంది బాలికలను వివస్త్రలను చేసి తనిఖీ
పర్సులోని రూ. 500 నోటు దొంగిలించారనే నెపంతో ఓ టీచర్ 13 మంది ఏడో తరగతి బాలికలను వివస్త్రలుగా మార్చి తనిఖీ చేసింది.
*రూ.500 నోటు పోయిందని...
గుర్‌దాస్‌పూర్: పర్సులోని రూ. 500 నోటు దొంగిలించారనే నెపంతో ఓ టీచర్ 13 మంది ఏడో తరగతి బాలికలను వివస్త్రలుగా మార్చి తనిఖీ చేసింది. ఈ ఘటన పంజాబ్ గుర్‌దాస్‌పూర్ జిల్లా మాదియాలా ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. డ్రాయింగ్ టీచర్ హర్జిత్ కౌర్ చర్యను అవమానంగా భావించిన విద్యార్థినిలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కౌర్ పరారీలోఉన్నట్లు తెలిపారు.


