
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం వర్షాకాలంలో ఇప్పటివరకు వరదలు, కొండచరియలు విరిగిపడటం తదితర వర్ష సంబంధిత కారణాల వల్ల 8 రాష్ట్రాల్లో 1,276 మంది మృత్యువాత పడ్డారని, వారిలో అత్యధికంగా 443 మంది కేరళలోనే చనిపోయారని సోమవారం కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కేరళలో 54.11 లక్షల మంది వరద బాధితులుగా మారారని, 47,727 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వెల్లడించింది. వరదల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో 218, పశ్చిమబెంగాల్‌లో 198 మంది, కర్ణాటకలో 166, మహారాష్ట్రలో 139 మంది, గుజరాత్, అస్సాం, నాగాలాండ్‌ల్లో వరుసగా 52, 49, 11 మంది మరణించారని తెలిపింది.