ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఉదయం 120మంది బీజేపీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఉదయం 120మంది బీజేపీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పారశుద్ధ్య కార్మికులకు వెంటనే జీత భత్యాలు చెల్లించాలనే డిమాండ్‌తో కేజ్రీవాల్ నివాసం ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
సుభాష్ ఆర్యా అనే బీజేపీ సీనియర్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ ధర్నా చోటు చేసుకుంది. ఫోర్త్ ఢిల్లీ ఫైనాన్స్ కమిషన్(ఎఫ్‌డీఎఫ్‌సీ) నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని నినాదాలు చేస్తూ వారు ఆందోళనకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురి మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బలవంతంగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.