యాత్ర ఫస్ట్‌ లుక్‌.. వైఎస్సార్‌గా మెగాస్టార్‌

YSR Biopic Yatra First Look Released  - Sakshi

మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ యాత్ర చిత్రం ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. మళయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహి వీ రాఘవ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం టైటిల్‌ లోగోను విడుదల చేసిన మేకర్లు.. నేడు ఫస్ట్‌ లుక్‌ను వదిలారు. 

పంచెకట్టులో రాజన్నను తలపిస్తూ.. అదే దరహాసం.. అదే తరహా అభివాదం చేస్తున్న మమ్ముట్టి పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. ఈ నెల 9 నుంచి చిత్ర షూటింగ్‌ మొదలుకానుంది. మహా ప్రస్థానం పేరిట దివంగత నేత చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలోనే యాత్ర చిత్రం ఉండబోతుందన్న సంకేతాలను దర్శకుడు ఇది వరకే ఇచ్చేశాడు. 

ఈ చిత్ర ప్రధాన తారాగణం.. మిగతా వివరాలను త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. త్వరగతిన చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేయాలన్న ఆలోచనలో దర్శకుడు మహి ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top