ఆ లక్కీ హీరోయిన్ ఎవరు? | Who is the lucky heroine ? | Sakshi
Sakshi News home page

ఆ లక్కీ హీరోయిన్ ఎవరు?

Jul 1 2014 12:43 AM | Updated on Sep 2 2017 9:36 AM

ఒక మంచి చిత్రం ఏ భాషలో వచ్చినా దాన్ని ఇతర భాషల్లో రూపొందించడం తప్పు కాదంటారు సినీ విజ్ఞులు. అయితే ప్రస్తుతం సినిమాలన్నీ రీమేక్‌ల మయంగా మారాయి.

 ఒక మంచి చిత్రం ఏ భాషలో వచ్చినా దాన్ని ఇతర భాషల్లో రూపొందించడం తప్పు కాదంటారు సినీ విజ్ఞులు. అయితే ప్రస్తుతం సినిమాలన్నీ రీమేక్‌ల మయంగా మారాయి. సొంత కథలతో రిస్క్ చేసేకంటే ఇతర భాషల్లో హిట్ అయిన చిత్రాలను రీమేక్ చేసుకోవడం సేఫ్ అనే భావన దర్శక నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. ఇంతకుముందు దక్షి ణాది చిత్రాలు హిందీలో వరుసగా రీమేక్ అయ్యాయి. గజిని, పోకిరి, కిక్, విక్రమార్కుడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది బాలీవుడ్ హిట్ చిత్రాలకు దక్షిణాది దర్శక నిర్మాతలు రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
 
 ఈ మధ్య విద్యాబాలన్ నటించిన హిందీ చిత్రం కహాని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయగా నయనతార నటించారు. ఓమైగాడ్ చిత్రం తెలుగులో వెంకటేష్, పవన్‌కల్యాణ్ హీరోలుగాపునర్నిర్మాణం కానుంది. కంగనా రనౌత్ నటించిన క్వీన్ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ దర్శక, నిర్మాత, నటుడు త్యాగరాజన్ పొందారు. ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటించడానికి ప్రముఖ హీరోయిన్లు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందనేది త్వరలోనే తేలనుంది.
 
 అయితే తాజాగా మరో బాలీవుడ్ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కుల కోసం పోటీ నెలకొందని సమాచారం. హిందీలో సంచలన నటి విద్యాబాలన్ నటించిన బాబి జసూస్ ఈ జూలై4న విడుదల కానుంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని దియ మిర్జ్జా నిర్మించారు. ఇందులో విద్యాబాలన్ లేడీ డిటె క్టివ్‌గా విభిన్న పాత్రను పోషించారు. ఆమె ఈ చిత్రంలో పలు గెటప్పుల్లో అలరిస్తారట. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నెంబర్ వన్ డిటెక్టివ్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశించే బాబిగా విద్యాబాలన్ నటనహైలెట్‌గా ఉంటుందట. మరి అలాంటి పాత్రకు దక్షిణాదిలో పోషించే లక్కీ హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement