'కామెడీ నైట్స్ విత్ కపిల్` షోకు కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తా | Want to invite Arvind Kejriwal on my show: Kapil Sharma | Sakshi
Sakshi News home page

'కామెడీ నైట్స్ విత్ కపిల్` షోకు కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తా

Dec 14 2013 3:01 PM | Updated on Apr 4 2018 7:42 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన `ఆమ్ ఆద్మీ పార్టీ` నిర్వాహణ తీరు తాననెంతో ఆకట్టుకుందంటూ కపిల్ శర్మ వ్యాఖ్యనించాడు.

ముంబై:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన `ఆమ్ ఆద్మీ పార్టీ` నిర్వాహణ తీరు తాననెంతో ఆకట్టుకుందంటూ 'కామెడీ నైట్స్ విత్ కపిల్'  ఫేమ్  కపిల్ శర్మ వ్యాఖ్యనించాడు.   తాను నిర్వహిస్తున్న `కామెడీ నైట్స్ విత్ కపిల్` కామెడీ షోకు  ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓ రోజు అతిధిగా ఆహ్వానించాలని భావిస్తున్నట్టు  తన షో అభిమానులకు అతను తెలిపాడు.

టీవీ ప్రేక్షుకులను ఎంతోగానూ అలరిస్తున్న హాస్యపూరిత కార్యక్రమం `కామెడీ నైట్స్ విత్ కపిల్` కామెడీ షో నిర్వహకుడిగా కపిల్ శర్మ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి  ప్రముఖులను ఆహ్వానిస్తూ తనదైన శైలీలో అతను కామెడీని పండిస్తుంటాడు.  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై కపిల్ శర్మ  ప్రశంసల జల్లు కురిపించాడు. ఆ పార్టీ రాకతో భారతీయ ప్రజలలో కొత్త మార్పు రాబోతుందని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నట్టు అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.   ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలంతా కొత్తదనాన్ని కోరుకుంటున్నారని, ప్రజలందరూ ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఆసక్తిగా చూస్తున్నారంటూ కపిల్ శర్మ అభిప్రాయ పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement