తెలుగులో నాకిది తొలి అడుగు | VIP 2 movie was released in August | Sakshi
Sakshi News home page

తెలుగులో నాకిది తొలి అడుగు

Jul 23 2017 11:47 PM | Updated on Sep 5 2017 4:43 PM

తెలుగులో నాకిది తొలి అడుగు

తెలుగులో నాకిది తొలి అడుగు

ధనుష్‌ హీరోగా రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీఐపీ 2’.

– ధనుష్‌
ధనుష్‌ హీరోగా రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీఐపీ 2’. ధనుష్, కలైపులి ఎస్‌. థాను నిర్మాతలు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం పాత్రికేయుల సమావేశంలో ధనుష్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగులో రిలీజైన ‘రఘువరన్‌ బీటెక్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘వీఐపీ 2’ తీశాం.

టాలీవుడ్‌లో నేను స్ట్రైట్‌గా వేసిన తొలి అడుగు ఇది. తెలుగులో చేయడం వల్ల భాష తెలిసింది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఇది నాకు స్పెషల్‌ మూవీ. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ధనుష్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు సౌందర్యా రజనీకాంత్‌. ‘‘నాకు హైదరాబాద్‌ అంటే ఇష్టం. ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. నేను హిందీలో కాకుండా ఇతర భాషల్లో నటించి చాలా రోజులైంది. సౌందర్య, ధనుష్‌ కారణంగానే ఈ సినిమాలో నటించాను’’ అన్నారు కాజోల్‌. ఈ కార్యక్రమంలో కలైపులి ఎస్‌. థాను కుమారుడు పరంధామన్‌ ఎస్‌. థాను పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement