అర్జున్‌ కాదలి యార్‌? | Vikram's son debuts with Arjun Reddy remake | Sakshi
Sakshi News home page

అర్జున్‌ కాదలి యార్‌?

Oct 13 2017 1:07 AM | Updated on Oct 13 2017 3:55 AM

Vikram's son debuts with Arjun Reddy remake

... అర్జున్‌ కాదలి యార్‌? ఇప్పుడు తమిళ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. కాదలి అంటే ప్రేయసి. యార్‌ అంటే ఎవరు అని అర్థం. అర్జున్‌రెడ్డిగా విజయ్‌ దేవరకొండ, ప్రీతీగా షాలినీ పాండే నటించిన ‘అర్జున్‌రెడ్డి’ సెన్సేషనల్‌ హిట్టయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళ రీమేక్‌ ద్వారా హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా పరిచయం కానున్నారు. ఇందులో అక్షరా హాసన్‌ లేదా శ్రియా శర్మను హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. అక్షరాహాసన్‌ అంటే కమల్‌హాసన్‌ చిన్న కూతురనీ, హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ చెల్లెలని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

శ్రియా శర్మ ఎవరంటే.. 12 ఏళ్ల క్రితం వచ్చిన ‘జై చిరంజీవ’లో చిరంజీవి మేనకోడలు లావణ్య పాత్రలో శ్రియా శర్మ  చైల్డ్‌ ఆర్టిస్టుగా నటించారు. గతేడాది వచ్చిన ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో శ్రియా శర్మనే కథానాయిక. అలా చైల్డ్‌ ఆర్టిస్ట్‌ స్థాయి నుంచి హీరోయిన్‌ వరకు చేరుకున్నారామె. మరి... చిరంజీవి రీల్‌ లైఫ్‌ మేనకోడలా? కమల్‌హాసన్‌ రియల్‌ డాటరా? ఈ ఇద్దరూ కాకుండా ‘అర్జున్‌రెడ్డి’తో లవ్‌లో పడేది ఎవరు? వెయిట్‌ అండ్‌ సీ. అన్నట్లు... తెలుగులో కాబట్టి ‘అర్జున్‌రెడ్డి’ అని పెట్టారు... మరి తమిళంలో? ‘అర్జున్‌ గౌండర్‌’ అనీ, ‘అర్జున్‌ ముదలియార్‌’ అనీ.. ఇలా అక్కడికి తగ్గట్టు టైటిల్‌ పెడతారేమో? లేక అర్జున్‌ కాకుండా వేరే పేరేమైనా పెడతారేమో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement