మాస్‌ యాక్షన్‌ ‘స్వామి స్క్వేర్‌’

Vikram Saamy Square Trailer - Sakshi

సింగం సిరీస్‌లో మూడు చిత్రాలను తెరకెక్కించిన తమిళ దర్శకుడు హరి, తాజాగా తన మరో సూపర్‌ హిట్ సినిమా సామికి సీక్వల్‌ను రూపొందిస్తున్నారు. విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన సామి 2003లో రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. తరువాత అదే సినిమాను తెలుగులో లక్ష్మీ నరసింహా పేరుతో బాలకృష్ణ హీరోగా రీమేక్‌ చేశారు. తాజాగా సామి సినిమా సీక్వల్‌ను సామి స్క్వేర్‌ పేరుతో రూపొందిస్తున్నారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్‌ మరోసారి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. విక్రమ్‌ జోడిగా కీర్తి సురేష్‌ నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్‌ ను స్టార్ట్‌ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్‌, టీజర్‌లను రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్ తాజాగా యాక్షన్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తమిళనాట స్వామి స్క్వేర్‌ జూన్‌ 14న రిలీజ్ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top