మైక్ ముందు నుంచి... కెమేరా ముందుకు..! | Vijay Yesudas turns cop to chase Dhanush | Sakshi
Sakshi News home page

మైక్ ముందు నుంచి... కెమేరా ముందుకు..!

Jul 7 2015 11:59 PM | Updated on Sep 3 2017 5:04 AM

మైక్ ముందు నుంచి... కెమేరా ముందుకు..!

మైక్ ముందు నుంచి... కెమేరా ముందుకు..!

తమిళ చిత్రం ‘మారి’ తాజా ప్రచార చిత్రం చూస్తే అందులో ఓ సర్‌ప్రైజ్ కనిపిస్తుంది. ఆ ట్రైలర్‌లో పోలీస్ దుస్తుల్లో

తమిళ చిత్రం ‘మారి’ తాజా ప్రచార చిత్రం చూస్తే అందులో ఓ సర్‌ప్రైజ్ కనిపిస్తుంది. ఆ ట్రైలర్‌లో పోలీస్ దుస్తుల్లో ఉన్నది - గాయకుడు విజయ్ ఏసుదాస్. ‘చిన్నారికి ఓణీలిచ్చే బంగారి బావా’ (గోవిందుడు అందరివాడేలే), ‘నిమిషం నిమిషం’(దృశ్యం), ‘చిట్టి జాబిలి’ (కడలి), ‘నువ్వంటేప్రాణమని’ (నా ఆటోగ్రాఫ్ స్వీట్‌మెమొరీస్) - ఈ పాటలన్నీ వింటే గుర్తొచ్చే గాయకుడు విజయ్. ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ తనయుడైన విజయ్ ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాటలు పాడారు. ఇప్పుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘మారి’ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నారు. ‘‘దర్శకుడు బాలాజీ మోహన్ ఈ పోలీస్ పాత్ర గురించి చెప్పినప్పుడు ముందు చాలా సందేహించాను. కానీ ఆయన నమ్మకం చూసి, ‘ఎస్’ చెప్పేశా. మా నాన్నగారిని అడిగితే కూడా ‘ఇక నీ ఇష్టం... కానీ గొంతు జాగ్రత్త. అది మాత్రం పోగొట్టుకోకు’ అని హెచ్చరించారు’’ అని చెప్పారీ సరికొత్త నటుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement