మీ లవ్‌.. నా లక్‌!

Vijay Devarakonda World Famous Lover Pre Release Event in Visakhapatnam - Sakshi

ప్రేమాభిమానాలు పొందడంఅదృష్టం

అభిమానులతో విజయ్‌ దేవరకొండ

వేడుకగా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలు

‘అవధుల్లేని మీ అభిమానం నేను జీవితంలో పొందిన పెద్ద అదృష్టం. ఇంతమంది అభిమానులు ఉండడం నాకు లభించిన చాలా పెద్ద బహుమతి’ అని ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలను బుధవారం గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : ‘అవధుల్లేని మీ అభిమానం నేను జీవితంలో పొందిన పెద్ద అదృష్టం. ఇంతమంది అభిమానులు ఉండడం నాకు లభించిన చాలా పెద్ద బహుమతి’ అని ప్రముఖ హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలను బుధవారం గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులను ఉద్దేశించి విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ తన కోసం వెల్లువలా వస్తున్న అభిమానులను చూస్తే మనసు ఉప్పొంగిపోతుందని తెలిపారు. ‘నాకోసం వస్తున్నారు. నాకోసం థియేటర్స్‌ నింపుతున్నారు. ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులు ఉండడం ఎంత అదృష్టం. అందుకే వారిని చూసినప్పుడు కౌగిలించుకోవాలని అనిపిస్తుంది.’ అని చెప్పారు. తన సినిమాపై క్రేజ్‌ ఉండటానికి కారణం రౌడీస్‌ అభిమానులని తెలిపారు. తన ప్రతి సినిమాలో కొత్తదనం కనిపిస్తుందన్నారు.

అభిమానులతో రాశీఖన్నా సెల్ఫీ
కొత్తదనం కోసమే తాను ఆరాటపడతానని తెలిపారు. నాలుగు ప్రేమ కథలు కలిపి తీర్చిదిద్దిన ఈ సినిమా మీ ముందుకు వస్తోంది. ఆదరించండి.’ అని కొరారు. ఈ సందర్భంగా అభిమానులకు రౌడీ హగ్‌లు, ఫ్లయింగ్‌ కిస్‌లు ఇచ్చారు. హీరోయిన్‌ రాశీ ఖన్నా మాట్లాడుతూ ఈ చిత్రంలో విజయ్‌ చాలా బాగా నటించారని కితాబిచ్చారు. నిజ జీవితంలో ప్రేమ ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులు తెలుసుకోవచ్చని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను చూడడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌ మాట్లాడుతూ ‘మళ్లీమళ్లీ ఇది రాని రోజు’ షూటింగ్‌ వైజాగ్‌లోనే చేశామని గుర్తు చేసుకున్నారు. వైజాగ్‌ ప్రజలు చాలా మంచి మనసున్నవారని కొనియాడారు.. ‘వైజాగ్‌ వండర్‌ఫుల్‌ సిటీ, చాలా అందమైన జ్ఞాపకాలను అందించిన నగర.’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వల్లభ, కిందు తదితరులు పాల్గొన్నారు.

స్పెషల్‌ లుక్‌లో విజయ్‌..
హీరో విజయదేవరకొండ లుంగీ కట్టుకుని, టవల్‌ తలకు చుట్టుకొని ఈ వేడుకల్లో పాల్గొని ప్రేక్షకులను మైమరపించారు. లుంగీతో స్టేజ్‌ పైకి వచ్చిన విజయ్‌ దేవరకొండను చూసి అభిమానుల కేకలు, అరుపులతో గురజాడ కళాక్షేత్రం దద్దరిల్లింది. వేడుకలో భాగంగా ప్రదర్శించిన నాట్యాలు అందరినీ ఆహ్లాదంలో ముంచెత్తాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top