ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి | Veteran Bollywood Actor Dinyar Contractor Passes Away | Sakshi
Sakshi News home page

ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతి

Jun 5 2019 10:42 AM | Updated on Jun 5 2019 10:42 AM

Veteran Bollywood Actor Dinyar Contractor Passes Away - Sakshi

బాజీగర్‌, 36 చైనా టౌన్‌, ఖిలాడీ లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దిన్యార్‌ కాంట్రాక్టర్‌ (79) మృతి చెందారు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. హిందీ గుజరాతీ సినిమాలతో పాటు పలు టీవీ షోస్‌లోనూ ఆయన నటించారు.

చదువుకునే రోజుల్లోనే రంగస్థల నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన 1966 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 2019లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఎన్నో అద్భుత పాత్రల్లో అలరించిన దిన్యార్‌ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement