వినోదాల వెక్కిరింత! | Vekkirintha Movie Audio Launch | Sakshi
Sakshi News home page

వినోదాల వెక్కిరింత!

Aug 16 2016 11:03 PM | Updated on Sep 4 2017 9:31 AM

వినోదాల వెక్కిరింత!

వినోదాల వెక్కిరింత!

కాకర్ల నాని (శ్రీధర్), వినీత్, ప్రేయసి నాయక్, మౌనికా రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వెక్కిరింత’.

కాకర్ల నాని (శ్రీధర్), వినీత్, ప్రేయసి నాయక్, మౌనికా రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వెక్కిరింత’. కాకర్ల రాహుల్, శ్వేత సమర్పణలో జంగాల నాగబాబు దర్శకత్వంలో కాకర్ల నాగమణి నిర్మించారు. చంద్రలేఖ, భానుప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని సాయి వెంకట్ విడుదల చేసి ఘంటాడి కృష్ణకు అందించారు.

దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రంలోని ఐదు పాటలు అద్భుతంగా కుదిరాయి. వినోద ప్రధానంగా సాగే చిత్రం. ప్రేక్షకులు బోర్ ఫీలవరు. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కె.శ్రీధర్, టి.పద్మలత, నల్లా వరుణ్ తేజ్.

Advertisement
 
Advertisement
Advertisement