ఆ ప్రశ్నలు ఇప్పుడొద్దు | Veere Di Wedding trailer released | Sakshi
Sakshi News home page

ఆ ప్రశ్నలు ఇప్పుడొద్దు

Apr 26 2018 1:32 AM | Updated on Apr 26 2018 9:02 AM

Veere Di Wedding trailer released - Sakshi

తల్సానియా, సోనమ్, కరీనా, స్వర భాస్కర్‌

నలుగురు అమ్మాయిల గ్యాంగ్‌. ఒకరు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నారు. మరొకరు పెళ్లి కోసం ఇంటినుంచి బయటకు వచ్చారు. ఇంకొకరు విడాకుల కోసం వెయిట్‌ చేస్తున్నారు. నాలుగో అమ్మాయి ప్రస్తుతానికి పెళ్లికి రెడీ అవుతోందట. మరి.. ఫైనల్‌గా వీరి కథకు శుభం కార్డ్‌ ఎలా పడింది? అనేది సిల్వర్‌ స్క్రీన్‌పై చూడాల్సిందే. శశాంక ఘో‹ష్‌ దర్శకత్వంలో కరీనా కపూర్, సోనమ్‌ కపూర్, స్వర భాస్కర్, శిక్షా తల్సానియా ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘వీరే ది వెడ్డింగ్‌’.

ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ముంబైలో జరిగింది. అమ్మాయిల గ్యాంగ్‌తో ట్రైలర్‌ మూవీపై ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాను జూన్‌ 1న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ట్రైలర్‌ లాంచ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అండ్‌ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ కామెంట్స్‌ గురించి సోనమ్‌ కపూర్‌ అండ్‌ స్వర భాస్కర్‌ను కొశ్చన్‌ చేశారు అక్కడి పాత్రికేయులు. అయితే క్యాస్టింగ్‌ కౌచ్‌ విషయాన్ని ఈజీగా దాటవేశారు ఈ బాలీవుడ్‌ భామలు.

‘‘మీరు అడిగిన ప్రశ్న ‘వీరే ది వెడ్డింగ్‌’  సినిమాకు చెందినది కాదు.ఈ సినిమా ఫంక్షన్‌ నుంచి డైవర్ట్‌ కావడం ఇప్పుడీ సందర్భంలో సరికాదనిపిస్తోంది’’ అని తెలివిగా చెప్పారు స్వరభాస్కర్‌. ‘‘క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడాల్సిన సందర్భం ఇది కాదు. ఇప్పుడు సరోజ్‌ఖాన్‌ కామెంట్స్‌ గురించి స్వరభాస్కర్‌ స్పందిస్తే అది హెడ్‌లైన్‌ అవుతుంది. సినిమా గురించి కాదు’’ అని సోనమ్‌ కపూర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో కరీనాకపూర్, తల్సానియా కూడా పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement