
రజనీకాంత్ కిడ్నాప్‌కు వీరప్పన్ ప్రయత్నం!
కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడట.
కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్.. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడట. అసలు రజనీ కంటే తానే గొప్పవాడినని వీరప్పన్ అనుకునేవాడని, అందుకే ఓ సమయంలో కిడ్నాప్ చేసినప్పుడు తనకు డబ్బులు ఇవ్వడానికి బదులు తనమీద ఒక సినిమా తీయాలని డిమాండ్ చేశాడని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పాడు.
కిల్లింగ్ వీరప్పన్ సక్సెస్‌తో మళ్లీ వీరప్పన్ సినిమా తీస్తున్న వర్మ.. అతడి జీవితంపై బాగా రీసెర్చ్ చేశాడు. వీరప్పన్ గ్యాంగులో ఉన్న మాజీ సభ్యుల ఇంటర్వ్యూలు, ప్రభుత్వానికి - వీరప్పన్‌కు మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్లను సంప్రదించి వీరప్పన్ గురించిన వివరాలు సేకరించాడు. వీరప్పన్ కొత్త సినిమాను బాలీవుడ్ హీరో సచిన్ జోషి నిర్మించడంతో పాటు అందులో నటిస్తున్నాడు. ఈ సినిమాలోనే రజనీకాంత్ కిడ్నాప్‌నకు వీరప్పన్ ప్రయత్నించిన సన్నివేశాలు కూడా ఉంటాయని తెలిసింది. ఈ విషయాన్ని వీరప్పన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవారి నుంచి తెలుసుకున్న వర్మ.. అదే అంశాన్ని తన సినిమాలో ప్రధాన సన్నివేశాల్లో ఒకటిగా తీసుకున్నాడు.
Veerappan used to think he is more famous than Rajnikanth and at one point he demanded a film to be made on him as a part of his Ransom
— Ram Gopal Varma (@RGVzoomin) 17 May 2016