మునిగి తేలుతూ... | Varun's Antariksham 9000 KMPH to release on Dec 21 | Sakshi
Sakshi News home page

మునిగి తేలుతూ...

Sep 22 2018 12:31 AM | Updated on Sep 22 2018 12:31 AM

Varun's Antariksham 9000 KMPH to release on Dec 21 - Sakshi

వరుణ్‌తేజ్‌

సాధారణంగా అంతరిక్షంలో తేలడం సహజం. కానీ వరుణ్‌ తేజ్‌ మాత్రం తేలడం బదులు మునిగిపోతున్నారు. కారణం ప్రేమ. ప్రస్తుతం అంతరిక్షంలో డ్యూయెట్స్‌ పాడుకుంటున్నారట వరుణ్‌. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌  హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపిహెచ్‌’. అదితీరావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి షెడ్యూల్‌లో ఉంది.

ఈ షెడ్యూల్‌లో ఓ పాటను, కొన్ని సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సంకల్ప్‌.  ఇందులో మూడు పాటలుంటాయని సమాచారం. అందులో ఒక పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా కంప్లీట్‌ అవుతుందని సమాచారం. దాంతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. షూటింగ్‌తో పాటుగా ఎడిటింగ్‌ పనులు కూడా జరుగుతున్నాయట. ఇందులో వరుణ్‌తేజ్, అదితీరావ్‌ హైదరీలు వ్యోమగామిగా కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, కెమెరా: జ్ఞానశేఖర్‌ వీయస్‌.

Advertisement
 
Advertisement
Advertisement