ఉగాది నుంచి... వైట్లతో... వరుణ్ తేజ్ | varun thej movie shooting starts at ugadi fest from the director sreenu vaitla | Sakshi
Sakshi News home page

ఉగాది నుంచి... వైట్లతో... వరుణ్ తేజ్

Mar 4 2016 11:05 PM | Updated on Sep 3 2017 7:00 PM

ఉగాది నుంచి... వైట్లతో... వరుణ్ తేజ్

ఉగాది నుంచి... వైట్లతో... వరుణ్ తేజ్

డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్, క్యారెక్టర్, మంచి దర్శకుడు... ఈ మూడూ కరెక్ట్‌గా కుదిరితే వరుణ్ తేజ్ సినిమా ఒప్పేసుకుంటారు.

డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్, క్యారెక్టర్, మంచి దర్శకుడు... ఈ మూడూ కరెక్ట్‌గా కుదిరితే వరుణ్ తేజ్ సినిమా ఒప్పేసుకుంటారు. ఇప్పటి వరకూ ఈ యువహీరో ‘ముకుంద’లో పక్కింటి అబ్బాయిగా, ‘కంచె’లో సైనికుడిగా, ‘లోఫర్’లో పక్కా మాస్ యువకునిగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్‌లోని మరో యాంగిల్‌ని ఆవిష్కరించడానికి దర్శకుడు శ్రీను వైట్ల సన్నాహాలు చేస్తున్నారు. వినోద ప్రధానమైన యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ని తెరకెక్కిం చడంలో శ్రీను వైట్ల దిట్ట. ఇప్పుడాయన వరుణ్ తేజ్ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గ కథ తయారు చేశారు. ఈ చిత్రాన్ని బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్టి ) నిర్మించ నున్నారు. ఏప్రిల్ 8న ఉగాది సందర్భంగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘క్లాస్‌నీ, మాస్‌నీ ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. ఇతర  నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement