టైటిల్‌ సాఫ్ట్‌... కుర్రాడు రఫ్‌! | Varun Tej Gym Workout with his Trainer | Sakshi
Sakshi News home page

టైటిల్‌ సాఫ్ట్‌... కుర్రాడు రఫ్‌!

Sep 18 2017 1:17 AM | Updated on Sep 19 2017 4:41 PM

టైటిల్‌ సాఫ్ట్‌... కుర్రాడు రఫ్‌!

టైటిల్‌ సాఫ్ట్‌... కుర్రాడు రఫ్‌!

చేసేది ప్రేమకథ అయినంత మాత్రాన హీరోలు సాఫ్ట్‌గా కనిపించాల్సిన అవసరం లేదు.

చేసేది ప్రేమకథ అయినంత మాత్రాన హీరోలు సాఫ్ట్‌గా కనిపించాల్సిన అవసరం లేదు. ఇవాళ అన్ని సినిమాలకు హీరోలు భారీ ఫిజిక్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్నారు. ప్రజెంట్‌ హీరో వరుణ్‌ తేజ్‌ కూడా కండలు పెంచుతూ, తన ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టారు. జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తున్న ఫొటోతో... ‘‘నేనొక గోల్‌ పెట్టుకుని వర్కౌట్స్‌ చేస్తున్నాను. సగం దూరం వచ్చేశాను’’ అని వరుణ్‌ ట్వీట్‌ చేశారు. సిక్స్‌ప్యాక్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వరుణ్‌తేజ్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్‌ ప్రసాద్‌ ‘తొలిప్రేమ’ పేరుతో ఓ చిత్రం నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్‌ సాఫ్ట్‌గా ఉన్నా ఇందులో వరుణ్‌ రఫ్‌ లుక్‌లో, సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తారేమో. అందుకే జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement