డిఫరెంట్‌ లుక్‌లో వరుణ్‌

Varun Tej First Look From Valmiki Movie - Sakshi

వరుణ్‌ తేజ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వాల్మీకి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్‌ మూవీ జిగర్తాండను తెలుగులో ‘వాల్మీకి’గా రీమేక్‌ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన చిత్రయూనిట్‌.. నేడు షూటింగ్‌ను ప్రారంభించింది.

నేడు వరుణ్‌తేజ్‌పై కొన్ని సన్నివేశాలను షూట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. వరుణ్‌ లుక్‌కు సంబంధించిన ఓ పిక్‌ను హరీష్‌ శంకర్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘వెల్కమింగ్‌ మై వాల్మీకి.. మొదటి రోజు షూటింగ్‌ బాగా జరిగింది.. ఇంకా ఇలాంటి రోజుల గురించి చూస్తుంటాను.. దేవీ శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ హాట్‌ సమ్మర్‌లో టెర్రఫిక్‌ వర్క్‌ చేస్తున్నారు’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top